స్వాగతం!

కిషోర్ భారతి 1971లో మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ జిల్లాలో సాంఘిక సంక్షేమంతో కూడిన విద్యా వ్యవస్థను సృష్టించాలనే లక్ష్యంతో చేసిన ఒక ప్రయోగంగా మొదలయింది. గ్రామాల్లోని ప్రజలతో మమేకమవడం ద్వారా సైన్స్ మరియు సాంఘిక శాస్త్రం సమీకృతం చేసుకుని విద్యా వ్యవస్థను సృష్టించాలనే లక్ష్యంతో ప్రారంభమైనది. ఈ ప్రాజెక్ట్ యొక్క చరిత్ర సవిస్తర వివరణ కొరకు దయచేసి హోషంగాబాద్ సైన్స్ టీచింగ్ ప్రోగ్రామ్ (HSTP) పేజీని కూడా చదవండి.

ఆరోగ్యం మరియు పర్యావరణంలో ప్రస్తుతం కనిపిస్తున్న సంక్షోభాలు పరిష్కరించాలన్నా; ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ద్వారా అభివృద్ధి చెందాలన్నా; విద్యా వ్యవస్థను మార్చాలన్నా, సామాజిక- సాంస్కృతిక మరియు శాస్త్రీయ విధానాలను ఒకదానితో ఒకటి మెలిపెట్టితే తప్ప సాధ్యం కావు.

అందువల్ల, కిషోర్ భారతిపై ఎలాంటి దాతృత్వం, లేదా ఆధారపడటం లేకుండా సమాజంతో క్రియాత్మక సంబంధాలను ఏర్పరుచుకోవడం ద్వారా మేము పనిచేస్తాము. ప్రస్తుతం, కిషోర్ భారతి టిఐఎఫ్ఆర్ (TIFR) లోని హోమీ భాభా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ (Homi Bhabha Centre for Science Education)యొక్క గ్నోలెడ్జ్ ల్యాబ్ (gnowledge lab) సహకారంతో విద్యా సమస్యలను పరిష్కరించడానికి దేశవ్యాప్తంగా హోమ్ ల్యాబ్ ల నెట్ వర్క్ ను సృష్టించడంలో చురుకుగా నిమగ్నమై ఉన్నాము. వివరాలకోసం CUBE program (Collaboratively Understanding Biology Education) చేస్తున్న హోమ్ ల్యాబ్స్ గురించి చదవండి.

స్వచ్ఛంద నిమగ్నత ద్వారా పనిచేసే ఒక సంస్థగా, మాతో చేరమని మేం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.